సోమశిల టు శ్రీశైలం టూర్‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్

Fri,November 22, 2019 10:20 PM




మహబూబ్‌నగర్ : సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందుకు వీలుగా ప్రారంభించిన ఏసీ లాంచీ సదుపాయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు క్రూయిజ్ బోట్ సర్వీసు ప్రారంభించినందుకు పర్యాటక మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. వారాంతాల్లో హైదరాబాద్ వదిలేందుకు పర్యాటకులకు చక్కని గమ్యస్థానం ఇదేనంటూ ఆయన పేర్కొన్నారు.

పూర్తి వివరాలకు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-46464ను లేదా https://tourism.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని నెటిజన్లకు సూచించారు. ట్వీట్‌తో పాటు సోమశిల ఏరియల్ వ్యూ, కృష్ణానది ఒడ్డున నిర్మించిన కాటేజీలు, లాంచీ ఫొటోలను సైతం పోస్ట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. అనేక మంది వెంటనే రీట్వీట్, కామెంట్, లైక్ చేశారు.

సమైక్య రాష్ట్రంలో కరువు నేలగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు పర్యాటక సొబగులు ఆకట్టుకుంటున్నాయని, ఇది కేసీఆర్ పాలనలోనే సాధ్యమైందని, మల్లన్న కొండల్లో మరో విహారం.. టూరిజం హబ్‌గా తెలంగాణ, అందమైన ప్రదేశం, తెలంగాణ పర్యాటకం ఇక కొత్త పుంతలు, ఎప్పుడెప్పుడు లాంఛీలో ప్రయాణించాలా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు, హైదరాబాదీలకు చక్కని అడ్డా.. ఇలా అనేక మంది కేటీఆర్ ట్వీట్‌కు కామెంట్స్ పెట్టారు.

స్వరాష్ట్రంలో అత్భుతాలు సాధించారని చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తమ శాఖ పనితీరును మెచ్చుకున్నందుకు, మంత్రి కేటీఆర్ అభినందలకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో భవిష్యత్తులో పర్యాటక రంగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకుపోతామన్నారు.

603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles