ఐటీ రంగంలో బెంగళూరును దాటిపోతాం : మంత్రి కేటీఆర్‌

Sat,September 21, 2019 11:46 AM

హైదరాబాద్‌ : ఐటీ రంగంలో హైదరాబాద్‌ నగరం త్వరలోనే బెంగళూరును దాటిపోతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ఆఫీస్‌ స్పేస్‌ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్‌ బెంగళూరును దాటిపోయింది. అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం కాబట్టే 17 శాతం వృద్ధిరేటు సాధ్యమైంది. ఐటీ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరింది. తెలంగాణ ఏర్పడే కంటే ముందు ఐటీ రంగంలో 3 లక్షల మంది ఉద్యోగులు పని చేసేవారు. ఐటీ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు ఫేస్‌బుక్‌, ఆపిల్‌, గూగుల్‌, అమెజాన్‌.. బెంగళూరు కాదని హైదరాబాద్‌కు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సమర్థత వల్లే ఆ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. 12 లక్షల 67 వేల ఉద్యోగాలు టీఎస్‌ఐపాస్‌ ద్వారా సృష్టించాం. బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ఐటీఐఆర్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కొనసాగించమని మోదీ సర్కార్‌ తేల్చిచెప్పింది. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పని మేం చేసుకుంటూ పోతున్నాం. తెలంగాణ వచ్చిందే ఉద్యోగాల కోసం. కాబట్టి ఉద్యోగ కల్పన సృష్టిస్తున్నాం. రాష్ట్రం యువతకు కేసీఆర్‌ సర్కార్‌పై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని.. అభివృద్ధికి సహకరించాలి అని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

2215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles