తట్ట, బుట్ట సర్దుకొని పోవడం పక్క

Wed,December 5, 2018 04:48 PM

Minister KTR speech at TRS Road show in Siricilla

రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ ఎన్నికల్లో 100 సీట్లు రావడం పక్క.. ఇప్పుడు వచ్చిన రాజకీయ పర్యాటకులు.. డిసెంబర్ 11న తట్ట, బుట్ట సర్దుకొని పోవడం పక్క అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రాహుల్ గాంధీ సీట్లు ఇచ్చిన, చంద్రబాబు నోట్లు పంచిన.. ఓట్లు వేయాల్సింది తెలంగాణ ప్రజలు.. కాబట్టి ఆలోచించి ఓటేయండి. మీరు మాతో ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరని కేటీఆర్ తేల్చిచెప్పారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కాంగ్రెస్ నేతలు వాళ్ల సొంత నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదన్నారు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్ వీణ, చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవాల్సిందేనని ఎద్దెవా చేశారు కేటీఆర్.

నా తల్లి నాకు జన్మనిస్తే సిరిసిల్ల రాజకీయ జన్మనిచ్చింది
నా తల్లి నాకు జన్మనిస్తే రాజకీయంగా మాత్రం సిరిసిల్ల జన్మనిచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లలో నా శాయశక్తుల కృషి చేశాను. చేసింది చారణా ఇంకా బారణా పని చేయాల్సి ఉందన్నారు కేటీఆర్. వచ్చే రోజుల్లో సిరిసిల్ల రాష్ట్రంలోనే నంబర్ వన్ కాబోతుందన్నారు. మళ్లీ మీరు తనను ఆశీర్వదిస్తే ఇంతకు పదింతలు అభివృద్ధి చేస్తాను. తాను ఎమ్మెల్యే కావడానికి జరుగుతున్న ఎన్నికలు కావు.. ఇవి తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలు అని కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. రెండేళ్లలో రైలు కూత వినిపిస్తాం. ఈ ఎన్నికలు మన తలరాతను మనం మార్చుకునేవి. ఆగం కాకుండా ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి అని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

3024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles