ఇంకుడు గుంత ఉంటేనే ఇంటికి అనుమతి

Tue,April 19, 2016 12:13 PM

Minister KTR says, save rain water

హైదరాబాద్ : రాష్ట్రంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టబోతుంది. లాతూర్ లాంటి పరిస్థితులు రాకముందే పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. భవిష్యత్తులో వాన నీటి సంరక్షణ దిశగా కొత్త పద్ధతులు అమలు చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాలను ఏరివేసే యంత్రం ఆంపిబియోస్ ఎక్స్‌కవేటర్ ప్రారంభంగా సందర్భంగా మంత్రి మాట్లాడారు.

భవిష్యత్‌లో వాన నీటిని సంరక్షణ చేస్తే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వెయ్యి ఇంకుడు గుంతలు తవ్వుతున్నామని తెలిపారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకే నీటి సంరక్షణ చేసుకోవాలన్నారు. నీటి నిర్వహణ సరిగా చేసుకుంటేనే.. లాతూర్ వంటి పరిస్థితులు రావు అన్నారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా.. నాలాల మళ్లింపు చేయాలన్నారు.

గణేశ్ ఉత్సవ సమితితో మేయర్, కమిషనర్ చర్చలు జరుపుతారు అని తెలిపారు. మట్టి విగ్రహాల తయారీపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గణేశ్ విగ్రహాలు 20 అడుగుల కంటే ఎత్తుగా ఉండకుండా చూడాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామన్నారు. తొలకరి జల్లుల నాటికి జీహెచ్‌ఎంసీ పరిధిలో మొక్కలు నాటుతామని ప్రకటించారు. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రతి పౌరుణ్ని భాగస్వామ్యం చేసే ఆలోచన ఉందన్నారు.

2634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles