ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

Sat,October 19, 2019 08:54 PM

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్లు, నెట్‌వర్క్ బలోపేతంపై మంత్రి సమీక్షలో చర్చించారు. సమావేశంలో పురుపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దీర్ఘకాలంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాలి.


రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి. నగరంలో సాధ్యమైనన్ని స్లిప్ రోడ్లు ఏర్పాటు చేయాలి. త్వరితగతిన మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మాణం చేపట్టాలని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీ కలిసి పనిచేస్తున్నాయి. బోరబండ-మియాపూర్ రహదారి నుంచి హైటెక్ సిటీ దిశగా స్లిప్ రోడ్ల ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.

670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles