రాష్ట్రంలోని మహిళలకు సిరిసిల్ల చీర పరిచయం అయింది

Tue,September 25, 2018 05:24 PM

minister ktr review meeting on sirsilla development

సిరిసిల్ల: ఈ నెల 29న మత్స్యకారులకు ద్విచక్రవాహనాలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీసీ కార్పోరేషన్‌కు చెందిన 400 మంది లబ్ధిదారులకు రుణాలు అందజేస్తామన్నారు. మైనార్టీ వెల్ఫేర్ ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాం. సంక్షేమకార్యక్రమాల కొనసాగింపుగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మిషన్‌భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష జరిపినం. ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చే పనులు 90శాతం పూర్తయ్యాయి. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని మహిళలకు సిరిసిల్ల చీర పరిచయం అయింది. అక్టోబర్ 12 నాటికి చీరలు పంపిణీ చేస్తామన్నారు. సిరిసిల్లలో 11 కిలోమీటర్ల మేర రింగ్‌రోడ్డు పూర్తి చేయాలి. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతానికి రైలుమార్గం ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. సిరిసిల్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. కలెక్టరేట్ సమీపంలో జాతీయస్థాయి ప్రమాణాలతో క్రీడాస్థలం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాను గొప్పగా తీర్చి దిద్దుతాం. వారం, పది రోజుల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. సిరిసిల్ల కొత్త చెరువు సుందరీకరణ పనులు జనవరికల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

1276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS