తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ

Wed,September 11, 2019 05:24 PM

Minister ktr meets with party leader in Telangana bhavan

హైదరాబాద్: రానున్న మున్సిపల్ ఎన్నికలపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. రెండోసారి మంత్రి పదవి చేపట్టాక కేటీఆర్ తొలిసారి తెలంగాణ భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నమస్కరించారు. పార్టీ మున్సిపల్ ఇన్‌ఛార్జీలు, సెక్రటరీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలతో సమీక్ష చేపట్టారు. ఈ సన్నాహక సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles