
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నివాసంలో మంత్రి కేటీఆర్ ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై పలువురి నేతలతో కేటీఆర్ చర్చించారు. సమావేశానికి మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గ్యాదరి కిశోర్ కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ హాజరయ్యారు. ఈ భేటీ కంటే ముందు మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డితో కేటీఆర్ సమావేశమై ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.