బాలుడి వైద్యానికి కేటీఆర్ భరోసా

Sun,September 23, 2018 07:53 PM

minister ktr help to brain tumor patient boy

సిరిసిల్ల : చిన్నవయస్సులోనే బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిని బాలుడు భాను ప్రసాద్(4)కు అమాత్యుడు బాసటగా నిలిచారు. బాలుడి వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. వివరాల్లోకివెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం రగుడు గ్రామానికి చెందిన ఇటికల దేవయ్య-నాగలక్ష్మి దంపతులకు కొడుకు భానుప్రసాద్ (4) ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మూడున్నరేళ్ల క్రితం దేవయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగలక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ కొడుకు భాను ప్రసాద్ అలనాపాలన చూస్తున్నది.

ఇటీవలే భానుప్రసాద్ అనారోగ్యం బారిన పడగా, బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో చేతిలో ఒక్క పైసా లేని నాగలక్ష్మి స్థోమత లేకపోవడంతో తన కొడుకుకు ఖరీదైన వైద్యం కోసం తమను ఆదుకోవాలని వేడుకుంది. విషయం సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయడంతో పలువురు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నేతలు మంత్రి కేటీఆర్‌కు దృష్టికి తీసుకువచ్చారు. సత్వరమే అమాత్యుడు స్పందించారు.

సోమవారం భానుప్రసాద్‌ను హైదరబాద్‌కు తీసుకురావాలని సూచించారు. బాలుడికి నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందించనున్నారు. కాగా భానుప్రసాద్ దయనీయ పరిస్థితి తెలుసుకున్న పుర్మాణి రాంలింగారెడ్డి రూ.3వేలు, మాజీ సర్పంచ్ పోచవేణి గంగయ్యయాదవ్ రూ.3వేలు, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ వొజ్జల అగ్గిరాములు రూ.1500, పోచవేణి ఎల్లయ్య, మాస అనిల్, పొన్నం శ్రీనివాస్, సిద్ది శ్రీనివాస్, బైకని ప్రభాకర్, రమేశ్, ఆర్‌ఆర్ యూత్ సభ్యులు రూ.వెయ్యి, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు రూ.2వేలు వారిని పరామర్శించి అందజేశారు. వీరితో పాటు పలువురు కూడ ఆర్థిక సహాయం అందజేశారు. బానుప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ వైద్యం చేయిస్తానని పేర్కొనడంతో బాధితుడి తల్లి నాగలక్ష్మి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

2712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles