స్కాంలతో నిండిన కాంగ్రెస్‌లోకి మరో దొంగ: కేటీఆర్

Wed,November 1, 2017 09:49 PM

Minister KTR fires on Congress and Revanth reddy

హైదరాబాద్: స్కాంలతో నిండిన కాంగ్రెస్ పార్టీలో మరో దొంగ రేవంత్‌రెడ్డి చేరిండని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లో ఉండి కుటుంబ పాలన గురించి మాట్లాడటం కంటే హీనం మరొకటి లేదన్నారు. రేవంత్‌రెడ్డి గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏరుతున్నడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. చేరిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీసిండన్నారు. రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండని చెప్పారు. ఐదు దశాబ్దాల కాంగ్రెస్ హీన చరిత్ర ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ చరిత్రంతా కుంభకోణాల మయమన్నారు. స్వాతంత్య్రం వచ్చినంక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ అనాడే చెప్పారని మంత్రి అన్నారు. పాలమూరు వలసలను సృష్టించింది.. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యకు కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను పిట్టలను కాల్చినట్లు కాల్చేసిందన్నారు. అదేవిధంగా 1971లో తెలంగాణ ప్రజల గొంతు నొక్కిందన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చింది. సీఎం కేసీఆర్ పోరాటంతో కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వక తప్పలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నరన్నారు.

గులాబీ దండయాత్ర కొడంగల్ నుంచే మొదలు..
గులాబీ దండయాత్ర కొడంగల్ నుంచే మొదలైందని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నడా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి ఆంధ్రానాయకుల సంచులు మోసిండన్నారు. దొంగతనం చేసిన రేవంత్‌రెడ్డిని జైల్లో పెట్టక.. ఎక్కడ పెడ్తరన్నారు. రేవంత్‌రెడ్డి అన్ని దారులు బంద్ అయిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరిండని చెప్పారు. రాహుల్‌గాంధీ జేజమ్మ దిగొచ్చినా టీఆర్‌ఎస్‌ను ఏం చేయలేరన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ కష్టాలు తీరేలా ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు.. రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఎవరైనా ప్రతి పల్లె నాది అనే విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నరని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంను అన్ని రంగాల్లో నెం.1గా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నరని పేర్కొన్నారు.

1801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles