కాంగ్రెస్, బీజేపీ నేతలను జనజీవన స్రవంతిలో కలుపుతం: కేటీఆర్

Wed,May 16, 2018 03:54 PM

Minister KTR distributing Rythu Bandhu cheques and pattadar passbooks in Hanmajipet and illanthukunta

రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించని కాంగ్రెస్, బీజేపీ నేతలకు కంటి పరీక్షలు నిర్వహించి జనజీవన స్రవంతిలో కలుపుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహిస్తమని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు చెక్కుల పంపిణీ, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... రూ. కోటితో ఇల్లంతకుంటలో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఇల్లంతకుంటలో 30 పడకల ఆస్పత్రిని కట్టిస్తామన్నారు. గోదావరి జలాలు తీసుకువచ్చి ఇల్లంతకుంట ప్రజల కాళ్లుకడుగుతమన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేసినట్లు వెల్లడించారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నమన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పొట్టనబెట్టుకున్నయి. గతంలో ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడేది. ఇప్పుడు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశాం.

67 ఏళ్లలో గత పాలకులు 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మిస్తే.. నాలుగేళ్లలో 20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించినట్లు చెప్పారు. రైతుబంధు పథకంపై కాంగ్రెస్ నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నరని మండిపడ్డారు. రైతులు బీర్లు తాగుతున్నరని బీజేపీ నేతలు మాట్లాడుతున్నరు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఐదు రూపాయలైనా ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును దేశమంతా మెచ్చుకుంటుందన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. రైతు యూనిట్‌గా పంట బీమా చేయాలన్నారు. నీటి తీరువా బకాయిలను రద్దు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

వేములవాడ మండలం హన్మాజీపేటలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ మెచ్చుకుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జోరుగా సాగుతోందని వెల్లడించారు. పంట పెట్టుబడి పథకంతో రైతులు పండగ చేసుకుంటున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

2678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles