అవినీతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ : కేటీఆర్

Sat,October 6, 2018 02:59 PM

Minister kTR clarification on Govt Jobs

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్‌పీఎస్సీ ద్వారా అవినీతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు ఏపీపీఎస్సీ అంటేనే కుంభకోణాలమయంగా ఉండేది.. పైరవీలు, డబ్బులతో ఉద్యోగాలు తెచ్చుకునేవారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. తాము నాలుగున్నరేండ్లలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తేల్చిచెప్పారు. యూపీఎస్సీని ఆదర్శంగా తీసుకొని టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ఘంటా చక్రపాణి అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,28,274 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే.. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ 1,02,217 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ 87,346 ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిలో ఇప్పటి వరకు 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగతా ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ కాకుండా ఉంటే 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కకుండా పోయేవి అని కేటీఆర్ తెలిపారు. విద్యార్థి లోకమంతా ఈ విషయాలన్నింటిపై చర్చ చేపట్టాలని కేటీఆర్ సూచించారు.

1670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles