హుషారుగా డోలు వాయించిన కేటీఆర్.. వీడియో

Sun,September 2, 2018 03:59 PM

Minister KTR beats dolu at Pragathi Nivedana Sabha

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు.. ప్రగతి నివేదన సభలో హుషారుగా కనిపించారు. ఇవాళ ఉదయం కళాకారులతో కలిసి కేటీఆర్ డోలు వాయించారు. డోలు ఎలా వాయించాలో రసమయి బాలకిషన్ చెప్పడంతో.. అందుకనుగుణంగా కేటీఆర్ డోలును కొడుతూ.. ఉత్సాహంతో స్టెప్పులేశారు. దీంతో అక్కడ మిగతా కార్యకర్తలంతా కేటీఆర్‌ను తమ భుజాలపైకి ఎత్తుకొని అభినందించారు. ఇక సభా ప్రాంగణంలో తిరిగిన కేటీఆర్.. మహిళా కార్యకర్తలను పలుకరించారు. గత ఐదారు రోజుల నుంచి ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కార్యకర్తలను కేటీఆర్ సమన్వయ పరుస్తూ.. సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేటీఆర్.

3301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles