పార్టీలో ప్రతి కార్యకర్తకూ గుర్తింపు.. మంత్రి ఈశ్వర్..

Sat,June 29, 2019 09:53 PM

minister koppula eshwar trs party membership drive at dharmapuri

ధర్మపురి : టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల ముందున్న పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని యజ్ఙంలా నిర్వహించాలని, టీఆర్‌ఎస్ పార్టీలో అంకిత భావంతో పనిచేసే ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందనీ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్‌లోని హోటల్ అనితలో టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదుపై ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పాగా వేయడంతో పాటు తిరుగులేని పార్టీగా టీఆర్‌ఎస్ అవతరించి ఉందని.. అటువంటి టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రతీ ఒక్కరు దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందన్నారు.

నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని యజ్ఙంలా నిర్వహించి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలన్నారు. ఇప్పటికే జిల్లాలో టీఆర్‌ఎస్ భవన్ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు.. ప్రస్తుతం మన ముందున్న పార్టీ సభ్యత్వాల నమోదును పూర్తి చేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జూలై 20వరకు పూర్తి చేసుకొని గులాబీ క్యాడర్ జోష్ నింపేలా మండల,గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుందామన్నారు. క్షేత్రస్థాయిలోని క్యాడర్ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అటువంటి పార్టీ బలోపేతం ప్రతీ ఒక్కరూ కోసం కృషి చేయాలన్నారు. పార్టీ సభ్యత్వాల నమోదు రెండువిధాలుగా చేయించాలని రూ.100తో క్రియాశీల సభ్యత్వం, రూ.50తో సాధారణ సభ్యత్వం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రెండులక్షల భీమా అందిస్తారన్నారు. సీఎం కేసీఆర్ ప్రతీ నియోజకవర్గానికి 50వేల సభ్యత్వాల లక్ష్యాన్ని నిర్దేశించారని, నిర్దేశించన లక్ష్యాన్ని పూర్తి చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

సభ్యత్వాల నమోదు కోసం నియమించిన సమన్వయ కమిటీల ఆద్వర్యంలో గ్రామాలలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మరోసారి పిలుపునిచ్చారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దామన్నారు. కార్యక్రమంలో ఎమెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles