లక్షా 50 వేల మందితో సీఎం కేసీఆర్ సభ..

Sun,March 24, 2019 05:43 PM

minister koppula eshwar inspected the preparations of cm kcr sabha in godavarikhani

గోదావరిఖని: ఏప్రిల్ 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు గోదావరిఖనిలో లక్షా 50 వేల మందితో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉంటుందనీ, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల నుంచి ప్రజలు, కార్యకర్తలు తరలివస్తారని రాష్ట్ర సాంఘీక, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు ఇవాళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడా మైదానంలో సీఎం సభా స్థలాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్‌లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. సభా ప్రాంగణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కోల్‌బెల్టు ఏరియాలోని కార్మికులు, ప్రజలు సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

2050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles