రేపు నగరానికి కిషన్‌రెడ్డి రాక

Thu,June 6, 2019 06:57 AM

Minister Kishan Reddy comes to Telangana tomorrow

హైదరాబాద్: కేంద్ర మంత్రి అయ్యాక మొదటిసారి గంగాపురం కిషన్‌రెడ్డి రేపు నగరానికి రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో అడుగిడనున్నారు. అక్కడి నుంచి బీజీపీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ బహిరంగా సభలో ప్రసంగిస్తారు. కాగా, స్వాగత ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో నగర పదాధికారులు, అసెంబ్లీ కన్వీనర్ల సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నగర మాజీ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డిలు రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, స్వామిగౌడ్, నగర ప్రధాన కార్యదర్శులు టి. రాజశేఖర్‌రెడ్డి, డా. ఎన్. గౌతంరావు, రామన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

2315
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles