కేంద్రం మంత్రి ప్రకశ్‌జవడేకర్‌తో మంత్రి కడియం బృందం భేటీ

Thu,July 26, 2018 08:02 PM

Minister Kadiyam team meeting with the Union Minister PRAKASH JAvadekar

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ని పార్లమెంటు సభ్యుల బృందం కలిసింది. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం, టీఆర్ఎస్ ఎంపీలు చర్చించారు.

విభజన‌చట్టంలో పొందుపరిచిన తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు పట్టించుకోవడం లేదని, ఇది దురదృష్టకరమనీ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. అనంతరం ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లోని గురజాడ సమావేశ మందిరంలో పార్లమెంటు సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టం ప్రకారం ఏపీకి న్యాయం జరగాలి, తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు.

హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్ ప్లాంట్, విద్యాసంస్థలు ఏవీ కేంద్రం పట్టించుకోవడం లేదనీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అయితే తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేయాలి, తెలంగాణకు ప్రత్యేక హోదా ఫలాలు తెలంగాణకు ఇవ్వాలని కడియం శ్రీహరి కోరారు. సోనియా ఇస్తే కాదు, తెలంగాణ ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నరనీ అన్నారు.

నాలుగు సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణలో ఒక్క విద్యా సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విభజన‌చట్టంలో పొందుపరిచిన గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నా కేంద్రం చిన్నచూపు చూస్తోందని కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయ‌ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తానని నేడు జరిగిన భేటీలో కేంద్రమంత్రి హామీ ఇచ్చారని కడియం శ్రీహరి వెల్లడించారు.

ఐఐఎం తెలంగాణకు ఇవ్వాలని నాలుగేళ్ళ క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని అడిగారరనీ, ఐఐఎం ఇస్తారా ఇవ్వరా అనేది చెప్పాలని కేంద్రమంత్రిని అడిగానని శ్రీహరి తెలిపారు. 14 కొత్త జిల్లాలలో కేంద్రీయ విద్యాలయాలు,జవహర్ నవోదయ విధ్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరగా, ఈ సంవత్సరం ఇస్తామని కేంద్రమంత్రి హమీ ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి కడియం తెలిపారు.

త్రిపుల్ ఐటీ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, గణిత శాస్త్రం కోసం విద్యార్థులకు అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ హైదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరామనీ కడియం శ్రీహరి తెలిపారు. త్వరగా విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, మధ్యాహ్న భోజన పధకాన్ని 12 వ తరగతి వరకు పొడిగించాలని కేంద్రమంత్రిని కోరామనీ కడియం శ్రీహరి వెల్లడించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వినతి పత్రాలను అందజేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో, అనంతపురం తెలంగాణ భవన్ లోని గురజాడ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమలలో పార్లమెంటు సభ్యులు బి. వినోద్, జే. సంతోష్ కుమార్, బాల్క సుమన్, రాజ్య సభ సభ్యులు బండ ప్రకాష్, బడుగు లింగయ్య, మాజీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్. మందా జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles