కాళోజి బాటలో తెలంగాణాభివృద్ధి: కడియం

Sat,September 9, 2017 09:30 AM

Minister Kadiyam Srihari pays tribute to kaloji narayana rao

హైదరాబాద్: ప్రజాకవి కాళోజి చూపిన బాటలో నడుస్తూ దేశంలో తెలంగాణను గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేసుకుని బంగారు తెలంగాణగా మార్చుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి నారాయణరావు 103వ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా మంత్రి కడియం శ్రీహరి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాళోజికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భాష, యాస గొప్పతనాన్ని తెలియజేస్తూ తెలంగాణ పోరును ఉదృతం చేసిన తెలంగాణ కవి కాళోజి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ కోసం జీవితాంతం అహర్నిశలు గొంతెత్తిన కాళోజి నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ, కాళోజి ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కాళోజి పేరిట తెలంగాణ భాషా వికాసానికి కృషి చేసిన వారికి కాళోజి అవార్డును ఇచ్చి సత్కరిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రముఖ కవి రావులపాటి సీతారాం కు కాళోజి పురస్కారాన్ని ఇచ్చి ప్రభుత్వం సత్కరిస్తోందన్నారు. పుట్టుక నీది, చావు నీది..బతుకంతా తెలంగాణది అని తెలంగాణ పట్ల ఆయనకున్న ప్రేమను చాటుకున్న కాళోజి జీవితం తెలంగాణ ప్రజలందరికి ఆదర్శమన్నారు.

2486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles