సీఎం కేసీఆర్‌ను నిండు మ‌నసుతో దీవించండి: క‌డియం

Wed,May 16, 2018 08:17 PM

minister kadiyam srihari distributes rythu bandhu cheques in warangal rural dist

వరంగల్ రూరల్: రైతు బంధు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పర్వతగిరి మండలం సోమారం, జమాలపూర్ గ్రామాల్లోని రైతులకు ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఆర్డీఓ మహేందర్, స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి కడియం.. "రైతు బంధు కార్యక్రమంలో ఇచ్చిన చెక్కులతో బీర్లు తాగుతున్నారని హైదరాబాద్ లో ఏసీ రూముల్లో ఉండి మాట్లాడుతున్నారు కొంతమంది సన్నాసులు. దయచేసి రైతులకు నా విజ్ఞప్తి.. రైతు బంధు కింద ఇచ్చే పంట పెట్టుబడిని వ్యవసాయానికే వాడండి. వేరే పనులకు వాడొద్దని కోరుతున్నా. రైతు కోసం ఏనాడు రూపాయి ఇవ్వని కాంగ్రెస్ నేడు రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే దానిని కూడా విమర్శిస్తున్నారు అంటే వారిని ఏమనాలి? అన్నారు.

నాలుగేళ్ళ కింద వ్యవసాయానికి సరైన కరెంట్ రాక, పొలం ఎండిపోయి అప్పులు తీరక రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. ఇది చూసి చలించి పోయిన సీఎం కేసీఆర్ రైతులు ఇక ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి నేడు అనేక పథకాలు అమలు చేస్తున్నారు.

రైతును అప్పు నుంచి విముక్తి చేయాలని లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేశారు. 17వేల కోట్ల రూపాయలతో 38 లక్షల మంది రైతులకు ఈ రుణ మాఫీ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. సాగునీటి కోసం ప్రాజెక్టులు కడుతున్నారు. ఇప్పుడు రైతు బంధు కింద పంట పెట్టుబడి ఎకరానికి 4000 రూపాయల చొప్పున రెండు పంటలకు 8000 రూపాయలు ఇస్తున్నారు. జూన్ 2, 2018 నుంచి రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు 5 లక్షల బీమాను అమలు చేయనున్నారు. ఈ విధంగా రైతు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ను నిండు మనసుతో దీవించండి.." అని మంత్రి చెప్పారు.

1786
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles