మహాకూటమి మోస కూటమి: కడియం

Wed,November 21, 2018 08:05 PM

minister kadiyam press meet in mahabubabad

మహబూబాబాద్: మహాకూటమి మోస కూటమి అని.. నామినేషన్ సమయంలోనే మిత్ర పక్షాలను కాంగ్రెస్ మోసం చేసిందని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. కూటమిలోజత కట్టిన వాళ్లను మోసం చేసిన పార్టీకి ప్రజలను మోసం చేయడం ఒక లెక్క కాదని మంత్రి తెలిపారు. మహబూబాబాద్‌లో మంత్రి కడియం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రతిసభ ఎంతో విజయవంతమైందన్నారు. ఈనెల 23న మహబూబాబాద్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని.. ఈ సభను కూడా విజయవంతం చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లాను సీఎం కేసీఆర్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారన్నారు.

మరోసారి మానుకోటను అన్ని రంగాల్లో ముందుంచాలంటే సీఎం కేసీఆర్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. 43 వేల కోట్లతో నేడు తెలంగాణ సంక్షేమ పథకాలను అమలవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి చేస్తే.. ఆంధ్రాలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు రాజకీయాల గురించి ప్రధాని మోదీనే పార్లమెంట్ సాక్షిగా వెల్లడించినట్టు ప్రస్తావించారు. 2019 - 20 విద్యా సంవత్సరంలో లక్షా 50 వేల కోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణలో ఉంటుందని ఆశిస్తున్నట్టు మంత్రి తెలిపారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు లేదు.. మ్యానిఫెస్టోపై కూడా వారికి అవగాహన లేదన్నారు. తెలంగాణలో కట్టే ప్రతి ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా లేఖలు రాసిన బాబుకి ఓట్లు ఎలా వేస్తారో నిర్ణయించుకోవాలన్నారు.

1531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles