గ్రామాల్లోనే కాదు.. ప్రతి ఒక్కరి హృదయంలో అంబేద్కర్‌ను ప్రతిష్టించుకోవాలి

Mon,May 28, 2018 06:01 PM

Minister kadiyam inaugurates ambedkar statue in jangaon district

జనగామ: ప్రతీ గ్రామంలోనే కాదు, ప్రతి ఒక్కరి హృదయంలో అంబేద్కర్‌ను ప్రతిష్టించుకోవాలని ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. జిల్లాలోని వెంకిర్యాల గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండ ప్రకాశ్, బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కడియం.. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్లనే ఇవాళ తాము ఇలా మీముందు మాట్లాడగలుగుతున్నామన్నారు.

"మీ గ్రామం ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. గ్రామంలో కట్టుకున్న ప్రతి మరుగుదొడ్డిని ఉపయోగించాలి. బహిర్భుమికి వెళ్లేవారికి వెయ్యి రూపాయల జరిమానా వెయ్యాలి. ఎస్సీ కమ్యునిటీ హాల్ కు 10 లక్షల రూపాయలు, మహిళల కమ్యునిటీ హాల్ కు 10 లక్షల రూపాయలు నా ఫండ్ నుంచి ఈ గ్రామానికి ఇస్తాను. మిల్క్ సెంటర్ కోసం ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇచ్చిన ఆరు లక్షలు వాడుకోవాలి.ముదిరాజ్ కమ్యునిటీ హాల్ కోసం ఎంపీ బండ ప్రకాశ్ 10 లక్షలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎల్ఈడీ లైట్ల కోసం జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ 5 లక్షలు రూపాయలు ప్రకటించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరివ్వాలన్న లక్ష్యం తెలంగాణ ప్రభుత్వానిది. ఏవైనా సమస్యలుంటే 15 రోజుల్లో పూర్తి చేయాలి. క్యాన్ వాటర్ కంటే మిషన్ భగీరథ వాటర్ చాలా మంచిది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి ఎక్కువ పండుతున్న ప్రాంతం ఇప్పుడు జనగామ. తెలంగాణ రాష్ట్రం రావడం, సీఎం కేసీఆర్ కావడం వల్లే రెండో పంటకు కూడా నీరందుతుంది. రైతులు అప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం కింద ఎకరాకి ఏడాదికి 4000 రూపాయలను పంట పెట్టుబడిగా ఇస్తున్నారు. నవంబర్ 19 నుంచి రెండో విడత కింద మరో 4000 రూపాయలు ఇవ్వనున్నారు. ఎన్నికల హామీలో లేకున్నా రైతులకు సాయం చేయాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ పథకం తీసుకువచ్చారు.

రైతులు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేలా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకం తీసుకువస్తున్నారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లి కోసం తల్లిదండ్రులు బాధపడొద్దని పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,116 రూపాయలను కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకం ద్వారా ఇస్తున్న మనసున్న మారాజు సీఎం కేసీఆర్. బోధించు, సమీకరించు, సాధించు అన్న అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా ఈ రోజు నాణ్యమైన విద్య తెలంగాణ రాష్ట్రంలో అందించాలని గత నాలుగేళ్లలో 540 గురుకులాలు తీసుకొచ్చిన ఘనత సీఎంది. అంబేద్కర్ సిద్దాంతాలు, ఆశయాల అమలులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం.." అని మంత్రి తెలిపారు.

1261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles