జూపల్లి బైక్ ర్యాలీ ప్రారంభం

Sat,September 15, 2018 12:07 PM

minister jupally krishna rao bike rally started

నాగర్‌కర్నూల్: మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ర్యాలీ నిర్వహించారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మలాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బైక్‌పై ర్యాలీని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 100 కిలోమీటర్ల దూరం మంత్రి పర్యటించనున్నారు. ఈసందర్భంగా వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం నుంచి కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో కొల్లాపూర్ గులాబీమయంగా మారిపోయింది.


472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS