సీఎం కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసం ఉంది : జూపల్లి

Sat,April 15, 2017 01:56 PM

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలే కేంద్రబిందువుగా, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం పని చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చినం అని చెప్పినా కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. ప్రజల అవసరాల గురించి కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ దూసుకుపోతున్నదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.


టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు భయపడదని తేల్చిచెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. అనేక ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఘనవిజయం సాధించారని చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కాంగ్రెస్ నేతలు స్వాగతించాలని సూచించారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను ప్రజలు స్వాగతిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు స్వాగతించడం లేదని ప్రశ్నించారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పథకాలను ప్రవేశపెట్టింది.. గెలిచిన తర్వాత ఆ పథకాలను అమలు చేయలేదన్నారు.

601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles