పుట్టిన బిడ్డ నుంచి కాటికి వెళ్లే వృద్ధుల వరకు సంక్షేమ పథకాలు

Wed,September 19, 2018 09:50 AM

minister jogu ramanna Criticizes Congress, tdp

ఆదిలాబాద్: అట్టడుగు వర్గాలు, నిమ్న జాతుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జోగు రామన్న అన్నారు. పుట్టిన బిడ్డ నుంచి కాటికి వెళ్లే వృద్ధుల వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధే కాదు, సామాజిక దృక్పథం కలిగిన ప్రభుత్వం తమదని వివరించారు. నాలుగున్నరేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. దేశం, రాష్ర్టాన్ని పట్టి పీడించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కు పట్టం కడుతారని రామన్న చెప్పారు.

అంతకుముందు ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి రామన్న పాల్గొన్నారు. కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిట్టల వాడలో రూ.5లక్షలతో నిర్మించే సవారీ బంగ్లా నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అన్నబహు సాటే చిత్రపటానికి నివాళులర్పించిన తరువాత రూ.5లక్షలతో నిర్మించే అన్నబహు సాటే భవన నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజలో మంత్రి పాల్గొన్నారు.

3765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles