గులాబీ జోష్.. పతికి తోడు సతి

Fri,November 16, 2018 03:41 PM

Minister Jagadish reddy wife Sunitha reddy participated in election campaign

సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మంత్రి జగదీశ్ రెడ్డి సతీమణి సునీతా జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక వైపు.. సతీమణి సునీతా రెడ్డి మరోవైపు ఇంటింటి ప్రచారంతో పట్టణంలో తమ ముద్ర వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నాటికి పట్టణం కలియ తిరిగేలా ముందుకెళ్తున్నారు. సునీతా రెడ్డి ప్రచారానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది.

మంత్రి జగదీశ్‌రెడ్డి తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో ఏర్పడ్డ యస్ ఫౌండేషన్‌కు సునీతా రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యస్ ఫౌండేషన్ పేరిట పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబురాలలో పాల్గొనడం ద్వారా పట్టణ మహిళలతో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని యువతీ యువకులను క్రీడా రంగంలో రాణించేలా ఫౌండేషన్ ఏర్పాట్లు చేసింది. తాజా ఎన్నికల ప్రచారంలో సునీతా రెడ్డి రంగంలోకి దిగడంతో మహిళా దండు కదిలింది.

2539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles