ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్‌రెడ్డి సతీమణి సునీతా

Sun,April 7, 2019 01:10 PM

Minister Jagadish Reddy Wife Election Campaign For Nalgonda TRS MP Candidate

నల్గొండ: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్న వేళ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నల్గొండ ఎంపీ సీటును కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. భువనగిరి, నల్గొండ నియోజకవర్గాలకు మంత్రి జగదీష్‌రెడ్డి ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణి సునీతా జగదీష్‌రెడ్డి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట శాసనసభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.

ఆదివారం ఉదయం సూర్యాపేట మండలం టేకుమట్ల, కేటీ అన్నారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. మూసీ ఆయకట్టు కింద రైతులకు నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆమె పేర్కొన్నారు. 2014కు ముందు రాష్ర్టాన్ని పాలించిన నాయకులకు మూసీ ఆయకట్టు కనిపించకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ను చూసి దేశమంతా ఆశ్చర్యపోతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎలాంటి విజన్‌ లేదు. 70ఏండ్లకు పైగా ఆ రెండు పార్టీలు పాలించి దేశాన్ని నాశనం చేశాయి. ఇప్పుడు యావత్‌ దేశం సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది. రైతుబంధు, రైతుబీమా వంటి విప్లవాత్మక పథకాలను కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. అటువంటి నేత నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీనే బలపర్చాలని కోరారు. సునీతా జగదీష్‌రెడ్డి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని రోడ్‌ షోను విజయవంతం చేశారు.

1614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles