క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి జగదీష్‌రెడ్డి

Fri,October 12, 2018 07:56 PM

Minister Jagadish Reddy Visits  Accident Victims in ou hospital

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి జగదీష్‌రెడ్డి పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన లునావత్ సంఘా, లకావత్ సుందర్‌ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం సంఘటన తెలిసిన వెంటనే ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో పాటు టీఆర్‌ఎస్ శ్రేణులను జగదీష్‌రెడ్డి అప్రమత్తం చేశారు. నలుగురి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదే ప్రమాదంలో గాయపడి.. సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి యోగ క్షేమాలను టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను శనివారం ఉదయం కలిసి పరామర్శించనున్నారు.


2584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles