టీఆర్‌ఎస్ పార్టీ కొత్త అధ్యయానికి అంకురార్పణ చుట్టింది...

Mon,July 1, 2019 06:28 PM

minister jagadish reddy trs party membership drive in suryapet

సూర్యపేట: జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటించారు. మండలాల వారిగా ఎక్కడికక్కడే సమావేశాలు నిర్వహించి టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించారు. పెన్‌పహాడ్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ...దేశ చరిత్రలోనే టీఆర్‌ఎస్ పార్టీ కొత్త అధ్యయానికి అంకురార్పణ చుట్టింది. కుట్రలు, కుతంత్రాలను, ద్రోహాలను తట్టుకొని రాజకీయ చరిత్ర రాసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పుకున్న తెలుగుదేశంపార్టీ నామరూపాలు లేకుండా చేసిన చరిత్ర టీఆర్‌ఎస్ పార్టీది. 100 ఏండ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుంది. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కనిపించేది కాదు. రాష్ట్రంలో, మహారాష్ట్ర, కర్ణాటకలో అధికారంలో ఉన్నాకూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రాజెక్టుకు అనుమతి పొందలేక పోయింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు పైనా కింద ఉన్న రాష్ట్రాలను ఒప్పించి ప్రాజెక్ట్ నిర్మించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తెలంగాణా రాష్ట్ర ప్రజలు విశ్వసనీయత కనపరిచి 2014, 2018 లోను పట్టం కట్టారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల త్యాగ ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న ఫలాలు. ఇతర పార్టీలు అధికారంలో ఉంటే ఆ సంక్షేమ పథకాలు నాయకుల ఇండ్లలోకి జేబుల్లోకి పోయాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకునేందుకు బారులు తీరుతున్నారు. ఇతర పార్టీలకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

1871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles