కేజీ టు పీజీ ఉచిత విద్య అందించి తీరుతాం: జగదీశ్ రెడ్డి

Wed,February 20, 2019 11:03 PM

minister jagadish reddy says they definitely give free education from kg to pg

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి
మంత్రిగా తొలిసారి జిల్లాకు రాక.. ఘన స్వాగతం

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర సాధకులు, బంగారు తెలంగాణ నిర్మాణ బాధ్యతలను ఎత్తుకొని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా, అభివృద్ధే లక్ష్యంతో మలి విడత ప్రజాసేవలో నిమగ్నం అవుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. తొలి విడుతలో మంత్రి పదవి చేపట్టి విద్యుత్ శాఖ, ఎస్సీ కులాల అభివృద్ధిలో అనేక విజయాలు సాధించగా మలి విడుతలో విద్యాశాఖ రావడంతో రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించి తీరుతామన్నారు.

మంగళవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగదీష్‌రెడ్డి బుధవారం తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రిలో ఉదయం సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన సొంత ఊరైన తుంగతుర్తి నియోజకవర్గం నాగారంలో గ్రంథాలయానికి శంకుస్థాపన చేసి అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో పూజలు చేశారు.

అక్కడి నుంచి తనను రెండు సార్లు గెలిపించిన సొంత నియోజకవర్గమైన సూర్యాపేటకు చేరుకోగా గాంధీనగర్‌లో ఎంపీపీ ఒట్టెజానయ్య ఘన స్వాగతం పలకగా పెద్దమ్మతల్లి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు వీధుల వెంట భారీ ర్యాలీగా తిరిగి స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. అనంతరం విద్యానగర్‌లోని తన నివాసానికి చేరుకోగా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ప్రజలకు విద్య, వైద్యం అత్యంత ప్రధానమైనవని, దీనిని గుర్తించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ రెండింటికి అదే స్థాయి ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో అన్ని ప్రాంతాలను సమాన స్థాయిలో అభివృద్ది చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

1617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles