కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు

Wed,August 8, 2018 04:30 PM

minister jagadish reddy review on eye camp scheme at nalgonda

నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న ప్రారంభించబోయే కంటి వెలుగు కార్యక్రమంపై ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం మూడు నెలలుగా ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 80 బృందాలను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. 800 మంది వైద్య సిబ్బందితో పాటు ఇతర శాఖల నుంచి 2 వేల మంది సిబ్బంది కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఒక్కో గ్రామంలో 350 మందికి కంటి పరీక్షలు చేయాలన్న లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు మంత్రి. కంటి పరీక్షలు నిర్వహించిన వారికి అవసరాన్ని బట్టి ఆపరేషన్లు నిర్వహిస్తారని మంత్రి స్పష్టం చేశారు.

878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles