ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు

Mon,October 21, 2019 08:36 PM

హైదరాబాద్: ప్రశాంత వాతావరణంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పోలింగ్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ.. 'ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం ప్రజలు అత్యధిక ఓటింగ్‌తో స్ఫూర్తిగా నిలిచారని' పేర్కొన్నారు.


హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో గెలుపు గులాబీ పార్టీదేనని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేస్తున్నాయి. 53శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తుందని మిషన్ చాణక్య వెల్లడించింది. 50శాతానికి పైగా ఓట్లతో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆరా ఎగ్జిట్ పోల్ పేర్కొంది.

513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles