నంద్యాల మృతిపట్ల మంత్రి జగదీష్‌రెడ్డి సంతాపం

Wed,February 20, 2019 08:10 AM

minister jagadish reddy pay tributes to ex mla nandyal srinivas reddy

హైదరాబాద్: నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఈ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నంద్యాల సేవలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నంద్యాల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని కొనియాడారు. సాయుధ పోరాటంలో దళ కమాండర్‌గా ఆయన చూపిన తెగువ వర్తమానానికి స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. అటువంటి ఉద్యమ నేతను కోల్పోవడం బాధకరమన్నారు. వారసత్వంగా వచ్చిన భూములను పేద ప్రజలకు పంచిన మహానేత అన్నారు. నంద్యాల స్ఫూర్తితో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.

3738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles