కాళేశ్వరం జలాలతో అన్ని చెరువులు నింపుతాం

Sat,November 9, 2019 09:37 PM

అర్వపల్లి : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు మళ్లించిన గోదావరి జలాలతో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలను నింపితీరుతామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని ఎస్సారెస్పీ డీబీఎం-71కాల్వలను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కలిసి పరిశీలించి మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా తిమ్మాపురం గ్రామ శివారులోని ఎడ్లవారికుంటకు గోదావరి జలాలు రావడం లేదని వైస్ ఎంపీపీ మారిపెద్ది భవానీ, రైతులు మంత్రికి విన్నవించగగా అక్కడి నుంచే ఫోన్ ద్వారా ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరానికి కృషి చేయాలని ఆదేశించారు.


రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, జిల్లాలోని ప్రతి చెరువు, కుంటను కచ్చితంగా కాళేశ్వరం జలాలతో నింపి తీరుతామని చెప్పారు. రైతులు ఎస్సారెస్పీ అధికారులకు సహకరించి గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ రెండోదశ కాల్వల ద్వారా జిల్లాలో రెండు పంటలకు గోదావరి జలాలను పంపిణీ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఎస్సారెస్పీ రెండో దశ కాల్వలకు కాళేశ్వరం జలాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు గోదావరి జలాలు తీసుకురావడం పట్ల మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌లకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్‌వై జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, రైతులు తండ లింగమూర్తి, సత్యనారాయణ, అవిలయ్య తదితరులు పాల్గొన్నారు.

875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles