సంక్షేమ పథకాల అమలులో ముందున్నాం...

Sat,June 29, 2019 04:08 PM

minister jagadish reddy launch trs party membership drive at yadadri bhongir

జలదృశ్యం లో పురుడు పోసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి ఆ తరువాత కాలంలో సంచనాలకు కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో రాష్ట్ర సాధన కోసమే అయినా అప్పుడున్న సమకాలీన పరిణామాలను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పార్టీగా రూపొందించారని ఆయన వెల్లడించారు. పార్టీ సభ్యత్వం నమోదులో భాగంగా ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం, గుండాల మండలాల్లో జరిగిన సమావేశాల్లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఒక ఉద్యమ పార్టీనీ ప్రణాళికా బద్దంగా రాజకీయపార్టీగా తీర్చిదిద్దిన అధినేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్య సాధనలో సఫలీకృతులయ్యారని కొనియాడారు. రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన టీఆర్ఎస్ పార్టీ వచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన విషయం పెద్ద సంచనలమని ఆయన చెప్పుకొచ్చారు.

పురిట్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారని .. ఓపిక లేక మరి కొందరు మధ్యలోనే కాడి ఎత్తేశారని ... అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో విజయఢంకా మోగించడం రాజకీయ వర్గాలలో పెను సంచలనమని ఆయన అభివర్ణించారు.
రాష్ట్రం సాధించడం దగ్గర నుండి అధికారం లోకి రావడం వరకు సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల రూపకల్పనలోనూ అంతకు మించి సంచలనాలు సృష్టిస్తోందని చెప్పారు.

దేశ రాజకీయాలలో ట్రబుల్ షూటర్ గా పేరున్న ప్రణబ్ ముఖర్జీ వంటి వారు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందించిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అదే సమయంలో పార్టీ సభ్యత్వానికి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పోటీ పడడం కూడ ఒక సంచలనమే నన్నారు. దేశంలో మిగితా రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా పోటీ పడి మరీ సభ్యత్వం తీసుకునే ఏకైక పార్టీగా టీఆర్ఎస్ పార్టీకీ గుర్తింపు వచ్చిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు.

2778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles