అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన

Wed,August 8, 2018 12:12 PM

సూర్యాపేట: మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సూర్యాపేట జిల్లా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు ఎస్ మండలంలోని మంగళితండా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. తండాలో రూ. 10 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బోడి కొండలపై 190 హెక్టార్లలో నాటిన 40 వేల మొక్కల పెరుగుదల, నిర్వహణను పరిశీలించారు. అదేవిధంగా కందగట్ల గ్రామంలోని చెరువుకట్టపై ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో 400 ఈత మొక్కలను నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కందగట్ల గ్రామంలో రూ. 25 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ. 10 లక్షలతో మత్స్యకారుల సొసైటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కందగట్ల గ్రామంలోని 314 మందికి రైతుబంధు సామూహిక జీవిత బీమా బాండ్లను పంపిణీ చేశారు.

712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles