విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత: మంత్రి జగదీశ్ రెడ్డి

Mon,June 17, 2019 06:48 PM

minister jagadish reddy inaugurated BC gurukulam school

సూర్యాపేట: ప్రభుత్వ విద్య పట్ల ఉన్న నమ్మకానికి, సీట్ల కోసం ప్రజలు పడుతున్న తపనే ఉదాహరణ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. విద్య ప్రాముఖ్యతను గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. సూర్యాపేట జిల్లా లో చివ్వేంల, హుజూర్ నగర్ లో మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా అధికారులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... కోటి ఆశలతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన119 నూతన గురుకుల పాఠశాలలకు వచ్చిన 91 వేల 500 మంది విద్యార్థులకు శుభాకాంక్షలు. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటికి వెళ్ళమీద లెక్కించే గురుకుల పాఠశాలలు మాత్రమే ఉంటే... ఈ రోజు ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థుల కోసం 800 కు పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయంలో సంవత్సరాల కొద్దీ తిరిగినా ఒక పాఠశాల వచ్చే పరిస్థితి లేదు.

నేడు ఒక్కరోజే 119 గురుకుల పాఠశాల లను ప్రారంభించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందన్నారు. భారతదేశం మొత్తంలో సీఎం కేసీఆర్ ను మించిన దార్శనికులు మరెవ్వరూ లేరన్నారు. విద్య ఎలా ఉండాలి అనే అంశం పై స్పష్టత నిచ్చిన పార్టీ దేశంలో ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో నే విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలు పై సీఎం కేసీఆర్ అధ్యయనం చేశారు. ఈ రోజు కేజీ నుంచి పీజీ విద్యావిధానంలో అత్యద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈ రోజు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నరు. విద్యార్థులను తీర్చిదిద్ద వలసిన బాధ్యత గురువులదే. బాలిక విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఎలాంటి ఫైరవీలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా గురుకుల సీట్లను కేటాయిస్తున్నాం. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై విశ్వసం, భరోసా పెరిగిందని తెలిపారు. అనంతరం ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ... కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాకే బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. బలహీన వర్గాలను పైకి తీసుకురావాలని మన కోసం సంక్షేమ కార్యక్రమాలు చేబడుతున్న ముఖ్యమంత్రి గారికి మనమంతా రుణ పడి ఉండాలని పిలుపునిచ్చారు. విద్యుత్ మంత్రిగా రాష్టాన్ని నంబర్ వన్ గా నిలబెట్టిన జగదీశ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి గా ఉండటం రాష్ట్ర, నియోజకవర్గ ప్రజల అదృష్టమని కొనియాడారు.

1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles