జోకర్లు..బ్రోకర్లు..లోఫర్లతో నిండిన కాంగ్రెస్ ను ఓడించాలి: జగదీశ్ రెడ్డి

Sat,October 20, 2018 07:23 PM

Minister Jagadish reddy fires on Congress party

నల్లగొండ: జోకర్లు...బ్రోకర్లు...లోఫర్లతో నిండిపోయిన కాంగ్రెస్ పార్టీనీ ఓడించాల్సిన తరుణం ఆసన్నమైందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం హాలియాలో జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశానికి మంత్రి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సన్నాహాక సభలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ నెల్లికల్లు గ్రామంలో ఏర్పడ్డ మంచినీటి ఎద్దడికి నిరసనగా ఎన్నికలు బహిష్కరించనున్నామని అక్కడి ప్రజలు పేర్కొనగా.. బహిష్కరించాల్సి వస్తే ముమ్మాటికి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందుగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకీ ఓటువెయ్యడం అంటేనే ఇక్కడి ప్రజలు ఇకపై సాగర్ ఎడమ కాలువ భూములకు నీరు వద్దు అని అగ్రిమెంట్ చేసినట్లు అవుతుందని ఆయన హెచ్చరించారు. బీ-ఫామ్ ఇస్తే చాలు ఎన్నికలలో గెలువవచ్చు అన్నది టీఆర్ఎస్ నేతల మనోగతమని.. టికెట్ కొరకై ప్రయత్నం చేశారని అయినా నిరాశ పడకుండా టీఆర్ఎస్ విజయానికి నడుం బిగించారని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ నుండి ఏ ఒక్కరూ విడిపోరని..అంతిమంగా పార్టీ నిర్ణయాన్ని గౌరవించే సంస్కృతి పార్టీలో ఉందన్నారు.

యావత్ భారతదేశంలోనే ప్రభుత్వం, పాలన ఎలా ఉండాలో యావత్ భారతదేశానికి నేర్పిన మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని ఆయన చెప్పుకొచ్చారు. 35 ఏండ్లుగా నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని ఏకధాటిగా పాలించిన జానారెడ్డి సొంత ఊరితో పాటు లక్షలాది ఎకరాలకు నిరందిస్తున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రంలో మంచినీరు అందించలేని దుస్థితికి కారణం జానారెడ్డి కాదా అని ఆయన నిలదీశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహాయ్యను గెలిపించుకోగలిగితే ఇక్కడ టికెట్ ఆశించిన యం సి కోటిరెడ్డికి అదే స్థాయిలో సమాన హోదా కల్పిస్తామన్నారు. 35 ఏండ్లుగా రాజవరం మొదటి తూముకు నీళ్లు ఇవ్వలేకపోయిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను విమర్శించడం విడ్డురంగా ఉందంటూ దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎలుబడిలోనే ఉన్నాయాని ఆయా పార్టీలు అధికారంలో ఉండగా కృష్ణా పుష్కరాలు వస్తే ఏ ఒక్కరోజు అయినా కృష్ణవేణిని సొంతం చేసుకోలేక పోయారన్నారు. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వచ్చిన కృష్ణా పుష్కరాల పేరుతో రూ.500 కోట్లు జిల్లాలో ఖర్చు పెడితే ఒక్క నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే రూ. 150 కోట్లు ఖర్చు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదన్నారు.

4997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles