ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఓ అసమర్థ నాయకుడు

Sun,March 24, 2019 03:04 PM

Minister Jagadish Reddy Fires On Congress Leaders

నల్లగొండ: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఆడ్రస్‌ ఉండదని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. దేవరకొండలో నియోజకవర్గస్థాయి టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన జగదీష్‌రెడ్డి మాట్లాడారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఓ అసమర్థ నాయకుడు. కాంగ్రెస్‌లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు చెల్లని రూపాయే. కాంగ్రెస్‌ నాయకులు పదవుల కోసమే తాపత్రయ పడుతారు. నల్లగొండలో చెల్లని రూపాయి కోమటిరెడ్డి.. భువనగిరిలో ఎలా గెలుస్తాడు? కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లిపోయినయి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావు. టీడీపీ అయితే పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసి పక్క రాష్ర్టానికి పోయింది. ఈ సమావేశంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

1265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles