రైతుబంధును అడ్డుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది!

Fri,October 5, 2018 05:23 PM

Minister Jagadish reddy fires on congress leaders

నల్లగొండ: జిల్లాలో టీఆర్‌ఎస్ బహిరంగసభ తర్వాత కాంగ్రెస్ నేతల మానసిక ప్రవర్తన మారినట్టుగా అర్థమవుతోందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానసికస్థితి బాగాలేదని ఇంతకుముందు మేమే అనే వాళ్లం.. ఇప్పుడు ప్రజలు కూడా అంటున్నారని చెప్పారు. దామరచెర్లలో నాలుగు వేల మెగావాట్ల పవర్‌ప్లాంట్‌ను తాము అధికారంలోకి వస్తే మూసివేస్తామని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఇది కోమటిరెడ్డి వైఖరా లేక కాంగ్రెస్ పార్టీ వైఖరా స్పష్టం చేయాలని సవాల్ చేశారు. నల్లగొండకు దామరచర్ల థర్మల్ ప్లాంట్‌ను పోరాడి సాధించుకున్నామని మంత్రి పేర్కొన్నారు.

ప్లాంట్‌పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మౌనంగా ఉంటే అది కాంగ్రెస్ వైఖరిగానే భావించాల్సి ఉంటుందని జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే థర్మల్ ప్లాంట్‌ను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. దామరచర్ల ప్రాజెక్టును ఇంతకుముందు లోలోన అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బహిరంగంగా తన నైజాన్ని చాటుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రగతి నిరోదక పార్టీ అని విమర్శించారు. నల్లగొండ జిల్లాను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయే. ప్యూడల్ సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళల నోట్లో మట్టికొట్టిందన్నారు. రైతుబంధు చెక్కులను కూడా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తీరును రైతన్నలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే పెన్షన్లను కూడా ఆపేయాలని కోర్టులో కేసులు వేసేలా ఉన్నారని ఆరోపించారు. ఎలాగు ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలపై కక్ష కడుతున్నారని వివరించారు.

2310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles