సానుభూతి కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు...

Sat,September 29, 2018 06:22 PM

Minister Jagadish reddy fires on congress

హైదరాబాద్‌ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,ప్రభుత్వ విప్ లు
పల్లా రాజేశ్వర్ రెడ్డి ,బోడకుంటి వెనకటేశ్వర్లు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత రెండు ,మూడు రోజులుగా రాష్ట్రం లో విచిత్ర డ్రామా జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ప్రవర్తిస్తున్నారు. ఐటీ సోదాలు ఒక నేత ఇంటి పై జరిగితే తుపాన్లు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మానవాళికి ఎదో ప్రమాదం జరిగినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఐటీ సోదాలు రాజకీయ పార్టీలకు ఆతీతంగా జరుగుతాయి. కాంగ్రెస్ నేతలు తమతో జైళ్లు నిండుతాయేమో అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఎవరో రేవంత్ రెడ్డి మీద పిర్యాదు చేస్తే వాస్తనాలు తెలుసుకునేందుకు ఐటీ శాఖ సోదాలు చేసింది. ఐటీ శాఖ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుందన్న ఇంగితజ్ఞానం కూడా కాంగ్రెస్‌ సీనియర్లుకు లేకపోయింది.

ఇది రేవంత్ రెడ్డితో మొదలయింది కాదు. ఐటీ సోదాలను రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేని కాంగ్రెస్ నేతలు కూడా కుండల కొద్దీ కన్నీరు ,టన్నుల కొద్దీ సానుభూతి కారుస్తున్నారని విమర్శించారు. తప్పు చేయక పోతే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళరు. పెద్దోళ్ళను తిడితే పెద్దోడ్ని అవుతానని రేవంత్ కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నారు. రేవంత్ భాష ఆయన దగ్గరే ఉంటుంది. ప్రజల దగ్గరికి వెళ్ళినపుడు వాళ్లు నిలదీస్తారు. గెలిచే శక్తి లేక కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది. కాంగ్రెస్ నేతల విమర్శల్లో అసహనం కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకున్నారు .గెలిచే శక్తి లేక కాంగ్రెస్, టీడీపీ లు ఒక్కటయ్యాయి. వారి సర్వేల్లో కూడా కాంగ్రెస్ కు సీట్లు రావడం లేదు. దొంగలు దొంగలు ఒక్కటై పోలీస్ వ్యవస్థని రద్దు చేయమని అడిగినట్టు ఉంది కాంగ్రెస్ నేతల తీరు అని మండిపడ్డారు.

రేపు ఐటీ విభాగాన్ని కూడా రద్దు చేయమంటారేమో ?.కులం ప్రస్తావన తేవడం నీచమైనది . ఎవరూ కులం తో నాయకులుగా ఎదగ లేరు. ఇపుడున్న అధికారులు కొత్తగా రాలేదు. కాంగ్రెస్ హాయం లో కూడా ఉన్నారు. అధికారుల నైతిక స్థయిర్యాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఐదుగురు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల మీద కూడా ఐటీ సోదాలు జరిగాయి. కార్యకర్తలను ఇంటికి పిలిపించుకుని సానుభూతి కోసం ప్రయత్నించారు. ఇలాంటి చిల్లర పనులతో కాంగ్రెస్ కు ఓట్లు పడవని హితవు పలికారు. చిల్లర నేతకు కాంగ్రెస్ సీనియర్ల మద్దతా అంటూ ప్రశ్నించారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలకు దగ్గరయ్యేది ఆలోచించాలని చెప్పారు.

2324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles