కాంగ్రెస్ హయాంలో నల్లగొండ తీవ్రంగా నష్టపోయింది..

Wed,September 26, 2018 06:52 PM

Minister Jagadish reddy fires on congress

నల్లగొండ : టీఆర్‌ఎస్ పాలనలో నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మాజీ జెడ్పీటీసీ అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి గులాబి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ హయాంలో నల్లగొండ తీవ్రంగా నష్టపోయిందని, 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పల్లెలను ఆగం చేసిందని మండిపడ్డారు. అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్పారు.

725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS