రాహుల్‌, లోకేష్‌.. ఇద్దరూ జోకర్లే..

Mon,April 1, 2019 01:50 PM

Minister Jagadish reddy fire on Rahul Gandhi and Lokesh

నల్లగొండ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఇద్దరూ జోకర్లే అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డికి మద్దతుగా తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి జగదీష్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దద్దమ్మ అయిన రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని.. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని ఆ పార్టీ నేతలు అడుగుతుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. రాహుల్‌ ప్రధాని అయితే తెలంగాణకు ఏం లాభం? సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ పథకాలు దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి అభివృద్ధిని ఆదరిస్తున్నారు. కాంగ్రెస్‌ చేతకాని తనం వల్లే తెలంగాణ అధోగతి పాలైంది. మోదీ తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టిండు తప్పితే చేసిందేమీ లేదు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిండు. కుబేరులకు లాభం చేసి విదేశాలకు పంపిన ఘనుడు మోదీ అని మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు.

2031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles