ఇంటర్‌ ఫలితాలపై ప్రతిపక్షాలు రాజకీయాలు

Tue,April 23, 2019 12:42 PM

Minister Jagadish reddy fire on Opposition Parties

హైదరాబాద్‌ : ఇంటర్‌ ఫలితాలపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులను, తల్లిదండ్రులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని సూచించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు. ఫలితాలపై విచారణ కొనసాగుతోంది. ఫలితాలపై రెండు, మూడు రోజుల్లో నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటాం. సాంకేతిక సమస్య ఉంటే సంస్థపైన చర్యలు తీసుకుంటాం. మానవ తప్పిదంగా తేలితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దు..
ఫలితాలపై అనుమానాలున్న వారు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందరికీ న్యాయం జరుగుతుంది. విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. పరీక్ష మళ్లీ రాయొచ్చు.. ప్రాణం పోతే మళ్లీ రాదు.. విద్యార్థులను తల్లిదండ్రులు గమనించాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి సూచించారు.

3110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles