కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారి : జగదీశ్ రెడ్డి

Sat,December 1, 2018 12:44 PM

Minister Jagadish reddy fire on Mahakutami politics

సూర్యాపేట : ఆత్మకూర్(ఎస్) మండలం దుబ్బతండాలో మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీ ఆర్ ఎస్ లో చేరారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడాది అవుతుంది అని మంత్రి పేర్కొన్నారు. గత పాలన ఎట్లా ఉండే? నాలుగేళ్ల టీ ఆర్ ఎస్ పాలన ఎలా ఉంది? అని ప్రశ్నించుకోని ఓటేయాలి. ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు రైతులను వేధించేవి. రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని మంత్రి ఉద్ఘాటించారు. టీ ఆర్ ఎస్ అధికారంలోకి రాగానే రూ. లక్ష రుణమాఫీ చేస్తాం. కాళేశ్వరం పూర్తి కావాలంటే.. మళ్లీ కేసీఆరే సీఎం కావాలి అని జగదీశ్ రెడ్డి చెప్పారు.

847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles