దేశ రక్షణ రంగాన్ని భ్రష్టు పట్టించారు..

Thu,April 4, 2019 03:15 PM

minister jagadish reddy fire on congress and bjp politics

నల్లగొండ : భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ కలిసి దేశ రక్షణ రంగాన్ని భ్రష్టు పట్టించాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన బోఫోర్స్‌ కుంభకోణం కానీ, మోదీ పాలనలో జరిగిన రాఫెల్‌ కుంభకోణం కానీ.. ఈ రెండు కూడా దేశ రక్షణ రంగాన్ని భ్రష్టు పట్టించేవి అని మంత్రి అన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులో న్యాయవాదులతో మంత్రి జగదీశ్‌ రెడ్డి సమావేశమై లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో ప్రజల ఎజెండాను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాయని కోపోద్రిక్తులయ్యారు. దేశాభివృద్ధికి ప్రతిబంధకాలుగా నిలిచిన కాంగ్రెస్‌, బీజేపీలను నిలువరించాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం అని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో రైతుబంధు, రైతుబీమా పథకాలను కేసీఆర్‌ ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మల్లాంటి న్యాయవాదులు ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి అభ్యర్థించారు.

849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles