అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయండి...

Thu,October 11, 2018 06:45 PM

minister jagadish reddy fire in congress party leaders

సూర్యపేట: దామరచర్ల వద్ద రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 4 వేల అల్ట్రా మేఘా పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిలిపివేస్తామంటూ గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై ఆయన సూర్యపేట మాట్లాడుతూ... అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రగతి విరోధకులైన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పవర్ ప్లాంట్ నిర్మాణం ఎక్కడ చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అటు ఖమ్మం ఇటు మహబూబ్ నగర్ జిల్లాలను పరిశీలిస్తున్నప్పుడు నల్గొండ జిల్లాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆవశ్యకత ను ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించి పట్టుబట్టి ప్రాజెక్ట్ ను సాధించామన్నారు. అధికారంలోకి రాగానే నిలువరింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన ముమ్మాటికి ద్రోహాపురితమైనదని ఆయన అభివర్ణించారు. అటు ఫోర్ట్ ఇటు రైలు మార్గం మరోవైపు రవాణా వసతి ఉన్న ప్రాంతంగా దామరచర్లను గుర్తించిన మీదటనే అన్ని అనుమతులు లభించాయని ఆయన స్పష్టం చేశారు.

అక్కడ మోడల్ టౌన్ షిప్ ఏర్పడడమే కాకుండా ప్రత్యక్షంగా ఎనిమిది వేల మందికి పరోక్షంగా పది వేల మందికి ఉపాధి కల్పించనున్న మేఘా అల్ట్రా పవర్ ప్లాంట్ ను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ మనస్తత్వానికి అద్దం పడుతోంది. ప్రాజెక్టులు నిర్మించకుండా అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దామరచర్ల వద్ద మేఘా అల్ట్రా పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలువరింప చేస్తానంటూ బహిరంగంగా చెబుతోంది. పాతకాంగ్రెస్ ను వదిలేస్తే గడిచిన 30 ఏండ్లుగా జిల్లాను పాలించింది ఈ నాయకులే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని ఎడమ కాలువకు నీరు లేకుండా వరుసగా ఏడూ సంవత్సారాలు కరువు వచ్చినా నోరు మెదపలేదని ధ్వజమెత్తారు.

నాలుగు సంవత్సరాలు గా ఎడమ కాలువ కింది భూములకు డెడ్ స్టోరేజీలోనూ నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దీ. జిల్లాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ నెలకొల్పాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పెట్టాము. అందుకనుగుణంగానే దామరచర్ల వద్ద పవర్ ప్లాంట్ ను పట్టు పట్టి సాదించుకున్నాం. మెఘా పవర్ ప్లాంట్ నెలకొల్పాలన్న ఆలోచన రాగానే అటు ఖమ్మం ఇటు మహబూబ్ నగర్ జిల్లాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించారు. ఫోర్ట్,రైలు మార్గం ,రవాణా వసతితో పాటు నీళ్లున్న ప్రాంతంగా గుర్తించిన మీదట దామరచర్ల ను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్ధించాము. మా అభ్యర్థనను ఆయన మన్నించి నల్గొండ జిల్లా కు ఈ అల్ట్రా మెఘా పవర్ ప్లాంట్ దామారచర్ల వద్ద నెలకొల్పేందుకు అంగీకరించారు. నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ అధీనం లోని బీహెచ్ఇఎల్ కు అప్పగించాం. అంతర్జాతీయ ప్రమాణాలనగుణంగా అతిపెద్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles