సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Tue,April 30, 2019 04:05 PM

Minister Jagadish Reddy election campaigning in Suryapet constituency

సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామాల్లో ఎక్కడ చూసిన టీఆర్ఎస్ అభ్యర్థులకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. గులాబీ పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి లభిస్తున్న ఇంతటి అపూర్వ స్వాగతనానికి కారణం సీఎం కేసీఆర్ ... కేసీఆర్ ను చూసే ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నరు. కేసీఆర్ ఐదు సంవత్సరాల పరిపాలన అనుభవమే ప్రజలను ఆ విదంగా ఆలోచింపచేస్తుంది. సమస్యలు ఇంకా ఉన్నాయంటే అది కాంగ్రెస్, టీడీపీల పుణ్యమే అరవై ఏళ్ళు పాలించిన వీళ్ళు తెలంగాణాలోని గ్రామాలను నాశనం చేసినారు. మన నీళ్లను, మన కరెంట్ ను, మన ఖజాన సొమ్మును మనకు లేకుండా చేసి ఆంధ్రకు తరలించారు .


కాంగ్రెస్, టీడీపీ ల వల్లే 40 ఏళ్ల క్రింద రావలిసిన ఎస్సారెస్పీ నీళ్లు ఇప్పటి దాకా ఎదురుచూసినా, రాకుండా పోయినయ్ . ఓట్ల కోసమే ఎస్సారెస్పీ కాలువలను తవ్వి ఓట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను వాడుకొని మోసం చేశాయి. దేశంలో నాలాగా పరిపాలన ఎవరూ చేయలేరని పోజులు కొట్టిన చంద్రబాబు 1995లో తిరుమలగిరిలో శంకుస్థాపన చేసిన ఎస్సారెస్పీ కాలువలు నేటికీ పూర్తి కాలేదు, అదే ఆంధ్ర లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ లు సంవత్సరం తిరిగే సరికి ప్ర్రారంభమయ్యాయి.


అయిదు సంవత్సరాల క్రితం కరెంట్ ఉంటే పెద్ద వార్త అయ్యే పరిస్థితి ఉండేది, రైతుల పరిస్థితి అయితే మరీ దారుణం గా ఉండేది, కాంగ్రెస్, టీడీపీల పాలనలో రైతు పాతాళానికి పడిపోయిండు. టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చాకే మన నిధులు మనకు వస్తున్నాయి. ఆనాడు కట్టిన పన్నులే నేడూ కడుతున్నాము, మన పన్నులను కాంగ్రెస్, టీడీపీ పాలకులు ఆంధ్ర కు దోచి పెట్టడంతో గ్రామాలు నిధుల లేమితో అభివృద్ధికి దూరంగా ఉండేవి.


టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రతీ గ్రామంలో నెలకు 4 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా పెన్షన్ ల కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నాం. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లు అన్ని ఎన్నికలు అయిపోగానే రెట్టింపు చేస్తున్నాం. గత పాలకుల హయం లో ఇంట్లో ఉన్న వృధ్ద తల్లిదండ్రులను భారంగా చూసే పరిస్థితిలు ఉండేవి, ఆ బాధలు అర్ధం చేసుకునే ఇంటికి పెద్ద కొడుకులా ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్లను పెంచాడు .


ఎన్నికల్లో చెప్పకున్నా, కల్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ల వంటి ప్రజా సంక్షేమ; పథకాలను అందిస్తున్నది దేశం లో ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. గతం లో గ్రామాలలో పార్టీల పేరుతో ఘర్షణలు ఉండేవి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం నెలకొల్పినం. పట్టా పాస్‌బుక్‌లు అందని రైతులకు ఎన్నికలు అయిన వెంటనే వారి ఇంటికే పాస్‌బుక్‌లు వచ్చే విదంగా చర్యలు తీసుకుంటాం.


వచ్చే ఆగస్టు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సూర్యాపేట నియోజకవర్గం లోని ఛివ్వేంల, పెన్ పహాడ్, ఆత్మకూర్ ఎస్, మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వబోతున్నాం. ప్రతీ రైతూ లక్షాధికారి కావాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. టీఆర్ఎస్ పార్టీ నిలిపిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించి జరుగబోయే అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

1185
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles