టీఆర్ఎస్ ఎన్నికల ఎజెండా ప్రజల ఎజెండా...

Sat,March 23, 2019 08:06 PM

సూర్యాపేట: జిల్లా కేంద్రం లోని సుమంగలి ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహరెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ లోక్ సభ ఎన్నికల పరిశీలకుడు రవీందర్ రావు , టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వి, పట్టణ టీ. ఆర్.ఎస్ అధ్యక్షుడు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గుండూరి ప్రవళిక ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... గడిచిన 30 ఏళ్ల లో జరిగిన ఎన్నికలను గమనిస్తే ప్రజలకు అర్థం కాని ఎజెండాలను ప్రజల పెట్టి కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయి. దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్లు అన్న రీతిలో కాంగ్రెస్, బీజేపీ లు వ్యవహరిస్తున్నాయి. ప్రజలకు అర్థం కాని బోఫోర్స్, రాఫెల్ వంటి ఎజెండాలు కాంగ్రెస్ , బీజేపీ ఎజెండాలు అయితే టీఆర్ఎస్ ఎన్నికల ఎజెండా ప్రజల ఎజెండా. తెలంగాణ రాష్ట్రం వైపు నాలుగేళ్ళ లొనే దేశం యావత్తు చూసే విధంగా కేసీఆర్ తీర్చిదిద్దారు. మరో నాలుగు సంవత్సరాల లో దేశం మొత్తం తెలంగాణ పల్లెలను చూసి వెళ్ళడానికి క్యూ కడతారు.


కాళేశ్వరం పూర్తి అయితే ప్రతీ పల్లె సశ్యశ్యామలం అవుతుంది.మోడీ ది ప్రచార ఆర్భాటం తప్పా, ప్రజలకు అవసరమయ్యే పథకాలను తీసుకురాలేడని ప్రజలకు అర్థం అయిపోయింది. అందుకే ఇప్పుడున్న సీట్ల లో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్ రాహుల్ గాంధీ కి తన నియోజకవర్గం ఎక్కడ ఉందొ, ఏ రాష్ట్రంలో ఏ బాష మాట్లాడుతారో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితి.. అని ప్రజలు గమనించారు. దేశం బాగు పడాలంటే ప్రజా సమస్య లను ఎజెండా గా తీసుకుని ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా 16 సీట్లు గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలి. దేశం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉన్న ఎజెండా ను చూసి మేధావులు సైతం విస్తుపోతున్నారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర ప్రగల్బాలే. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేసి లోక్ సభ కు పోటీ చెయ్. కోదాడ,హుజూర్ నగర్ ల లో చేసిన ఒక్క అభివృద్ధి పని గురించయినా చెప్పే దమ్ము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా. గులాబి సైనికులు ఉత్తర కుమారుల ను సాగణపేందుకు సిద్ధం అయి రంగం లోకి దిగాలి. పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న వేదిక మీదనే రాష్ట్రంలో మాకు సమర్ధవంతమైన నాయకత్వం లేదన్నది కోమటిరెడ్డి బ్రదర్స్ 18 సంవత్సరాలు గా ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉత్తమ్ కు చేత కాదు ....దద్దమ్మ అంటూ సంబోధించింది ఈ బ్రదర్స్ కాదా మీ స్వభావాన్ని వేదికల మీద మీరే బయట పెట్టుకుంది నిజం కాదా, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటలు కాదు కరిగిపోతున్న మంచుకోటలు. ఈ ఎన్నికలతో జిల్లాకు పట్టిన కాంగ్రెస్ మహమ్మారి పీడ విరుగడ అవుతోంది.

మొన్నటి శాసనసభ ఎన్నికలతో ఇప్పటికే 75%పీడ విరుగడ అయింది. కేసీఆర్ జాతీయ ఎజెండా ను అమలు జరుపుకోవడానికి గ్రామాలు, గ్రామాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో టీఆర్ఎస్ మినహా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. రైతు బంధు, రైతు బీమా, వంటి పధకాలు రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతున్నాయి. కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన పదకాలనే మోడీ కాపీ కొడుతున్నారు. దేశానికే మార్గ దర్శక పధకాలు ప్రవేశ పెట్టిన కేసీఆర్ గారు ప్రధాని ఎందుకు కాకూడదు. 9 మంది ఎంపీలు ఉన్న దేవెగౌడ ప్రధాని అయ్యారు. 16 మంది ఎంపీ లను గెలిపించుకుంటే కేంద్రం లో శాసించే ది టీఆర్ఎస్ నే నల్లగొండ నియోజకవర్గం లో అభ్యర్థులు దొరకక పోవడం వల్లే పీసీసీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నారు. జిల్లా గౌరవం ను పెంచే విధంగా కార్యకర్తలు భారీ మెజారిటీ కోసం కృషి చేయాలని కోరారు.

1867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles