కరెంటు అడిగితే కాల్చి చంపిన చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తా

Thu,November 29, 2018 09:51 PM

minister jagadish reddy election campaign at suryapet

సూర్యాపేట : వ్యవసాయానికి కరెంటు అడిగితే రైతులను కాల్చిచంపిన చంద్రబాబు నాయుడుతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకుని కూటమిగా ఏర్పడటం సిగ్గు చేటని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబుతో కలిసి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం కేసారం, కాసరబాద, ఇమాంపేట, తాళ్లకాంపాడ్, జాటోతు తండా, రామ్లతండా, రూప్లతండాలతోపాటు పెన్‌పహాడ్ మండలంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళా సంక్షేమం కోసం కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం సన్నబియ్యం పథకాలతోపాటు కుల వృత్తులకు న్యాయం చేశారన్నారు.
దేశానికి వెన్నెముకైన రైతులను, వ్యవసాయ రంగాన్ని అభివృధ్ధి చేయడానికి 24గంటల ఉచిత కరెంటు, ఉచితంగా ఎరువులు, విత్తనాలు.. పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు, రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రైతు భీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోదుగు నాగిరెడ్డి, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles