నాకు రాజీనామా ఒక్కటే నిమిషం పని: జగదీష్ రెడ్డి

Sun,March 31, 2019 03:51 PM

minister jagadish reddy election campaign at huzurnagar

నల్గొండ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది ....నల్గొండ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన పీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలన్న రాష్ట్ర విద్యాశాఖా మంత్రి, నల్గొండ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జ్ గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన డిమాండ్ పై స్పందించిన పిసిసి నేత నేనెందుకు రాజీనామా చెయ్యాలి ....అంత గా అనిపిస్తే మంత్రినే రాజీనామా చేసుకోమనండంటూ జవాబు ఇచ్చిన విషయం విదితమే.

ఈ నేపద్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ నియోజకవర్గం జాన్ పహాడ్ వద్ద జరిగిన ఎన్నికల ప్రచారంలో బాగంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎందుకు రాజీనామా చెయ్యాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించాలని డిమాండ్ చేశారు. అయినా నేనూ రాజీనామా చేసేందుకు
సిద్దంగా ఉన్నానని అందుకు ఉత్తమ్ సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. పీసీసీ నేత గా నల్గొండ బరిలో నిలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి తన గెలుపు మీద తనకు నమ్మకం ఉంటే రేపు ఎప్పుడో రాజీనామా చెయ్యాల్సిన శాసనసభకు ముందుగా రాజీనామా చేసి తన బలాన్ని నిరూపించుకోవాలని తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమే నని ఆయన తెలిపారు. అందుకు స్పందించిన ఉత్తమ్ మాటలకు తాను ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని దమ్ముంటే ఇద్దరం ఒకటే సారి రాజీనామా చేద్దాం అందుకు ఉత్తమ్ సిద్ధమేనా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.

రాజీనామా మీద సంతకం పెట్టడం తనకు ఒక్క నిమిషం పని అని ఉత్తమ్ కు అంతటి ధైర్యమే ఉంటే రాజీనామాకు సిద్ధ పడాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని నల్గొండలో ఆ పార్టీ చుక్కాని లేని నావేనేనని మిర్యాలగూడలో అసలు ఆ పార్టీకీ ఆనవాళ్లు లేవని సూర్యపేట లో జవసత్వాలు పోయి ఆ పార్టీ నాయాకత్వం తెర మరుగు అయిందని ఆయన పేర్కొన్నారు . ఇక మిగిలిన కోదాడ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ నియోజకవర్గలలో ఉనికిని కాపాడుకునేందుకు తాపాత్రయ పడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగజారుడు ప్రచారానికి పాలపాడుతున్నారని ఆరోపించారు.


టీఆర్ఎస్ శ్రేణులకు ఫోన్లు చేసి మొన్నటి ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సైదిరెడ్డి ఎమ్మెల్యే కావాలంటే లోక్‌సభ ఎన్నికలలో తనకు ఓటువేయండంటూ ప్రాధేయపడవలసిన దుస్థితికి చేరుకున్నాడని ఆయన దుయ్యబట్టారు. ఉత్తమ్ చెప్పినట్లుగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేస్తే సైదిరెడ్డి ఎమ్మెల్యే కాడని..... హుజుర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మెజారిటి సాధించగలిగితేనే సైదిరెడ్డి శాసనసభ కు ఎన్నికవుతారని ఆయన స్పస్టం చేశారు.

ఓటమి భారం తో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ లోను ఉత్తమ్ వెనకబడితే తనకు తానుగా ప్రజలకు మొహం చూపించలేక రాజీనామా చేసి విశ్రాంతి తీసుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. మొన్న శాసనసభకు జరిగిన ఎన్నికలలో సైదిరెడ్డికి మొట్టమొదలే టికెట్ ప్రకటించి ఉంటే ఫలితాలు మరో విదంగా ఉండదన్నారు. ట్రక్కు గుర్తు టక్కు టమాటా విద్యాలతో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఉన్న ఉత్తమ్ కు మాటమీద నిలబడే స్వభావమే లేదన్నారు. మొన్నటి ఎన్నికలలో ఓటెయ్యండి ముఖ్యమంత్రి ని అవుతానంటూ నమ్మబలికిన ఉత్తమ్ ఇప్పుడు ఓటెయ్యండి సెంట్రల్ మినిస్టర్ ను అవుతా అంటూ కొత్త మొసాన్ని తెరమీదకు తెచ్చారని ఆయన ఆరోపించారు .

ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఆంధ్ర పప్పు ఒకరు అయితే రాహుల్ గాంధీ యావత్ బారతదేశానికే ముద్దపప్పు లాంటి వాడని ఆయన అన్నారు .అందుకే ఆయనకు అవకాశం ఉన్నా యూపీఏ 1, యూపిఏ 2 లలో ఆయనకు ప్రధాని కాదు కదా కనీసం కేంద్రమంత్రి పదవిని కూడా కట్టబెట్టలేదని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు .

నల్గొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహా రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు హుందాగా ఉండాలని ఆ హుందా తనం తెలిసిన వ్యక్తిని నేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో ప్రజల ముందుకు వచ్చానని మీరు ఆశీర్వదిస్తే పార్లమెంట్ కు పోతానన్నరు.
రాజకీయాలు తనకు ఎంతమాత్రం కొత్త కాదని మొట్టమొదటి మండలాల వ్యవస్థ ఏర్పడ్డప్పుడు మునుగోడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడుగా పోటీచేసిన అనుభవం తనకుందన్నారు. వ్యాపారంలో స్థిర పడిన తాను గుళ్లు, బళ్ళు ఎన్నో కట్టించి నిత్యం ప్రజాసేవలో ఉన్నానన్నారు. అటువంటి నన్ను అనుభవం లేదన్న పెద్ద మనిషి నేనూ రాజకీయాలలో ఉన్నప్పుడు తాను ఎక్కడ ఉన్నాడో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.

3723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles